మనం వివిధ రకాలైన రెస్టారెంట్స్ కి వెళ్లి భోజనం చేయడమో , వెరైటీ వంటకాలు రుచి చూడడమే చేస్తాం , కొందరు జనాలని ఆకట్టుకొని వారు రెస్టారెంట్ ల వైపు రప్పించుకోడానికి వివిధ ప్రయత్నాలు , ప్రమోషన్ లు చేస్తూ ఉంటారు , కాని యూరోప్ లో మాత్రం అన్నిటికి భిన్నంగా నీటిలోనే రెస్టారెంట్ కట్టారు.అండర్ (UNDER) పేరుతో యూరప్‌లో తొలి అండర్ వాటర్ రెస్టారెంట్ ప్రారంభమైంది.
మిగతా రెస్టారెంట్లలో అక్వేరియంలతో ఇలాంటి రెస్టారెంట్లు కనిపిస్తాయి.కానీ ఈ రెస్టారెంట్ మాత్రం ఏకంగా సముద్రం లో నే కట్టారు , ఇక్కడికి వచ్చే జనాలు రియల్ లైఫ్ థ్రిల్ మిస్ కాకుండా సముద్రంలోనే ఏర్పాటు చేయడం విశేషం.

నార్వేలోని నార్త్ సీని లింక్ చేస్తూ కాంక్రీట్ ట్యూబ్ నిర్మించారు.నార్వేకు చెందిన స్నోహెట్టా అనే నిర్మాణ సంస్థ ఈ రెస్టారెంట్ ని పూర్తిగా నిర్మించింది.ఈ రెస్టారెంట్ కట్టడం పూర్తి అవ్వగానే అన్ని హంగులతో ఈ మార్చ్ 20 నుండి సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది.ఈ రెస్టారెంట్ ప్రారంభం కాకముందే బుకింగ్స్ మొదలయ్యాయి , బుకింగ్స్ ప్రారంభించిన రోజులో 7000 మంది ఈ రెస్టారెంట్ లో టేబుల్ బుక్ చేసుకున్నారు.

ఈ అండర్ అనే రెస్టారెంట్ ని సముద్ర ఉపరితలానికి 16 అడుగుల లోపల నీటి మధ్యన నిర్మించారు.లోపలికి వెళ్ళాక అందులో గ్లాస్ విండో నుండి చూస్తే సహజ సిద్ధమైన వెలుతురు తో చుట్టూ జలచర జీవులతో ఆ రెస్టారెంట్ కి వెళ్లిన జనాలను కనువిందు చేస్తుంది.ఓవైపు రెస్టారెంట్‌లో కూర్చొని భోజనం చేస్తుంటే… మరోవైపు సముద్రజీవులు చుట్టూ తిరుగుతూ కనిపించడం ఓ వింత అనుభూతి.రెస్టారెంట్ అలంకరణవిషయంలోనూ స్నోహెట్టా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం.యూరోప్ లో తొలి అండర్ వాటర్ రెస్టారెంట్ కావడం తో రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది ఈ రెస్టారెంట్ కి వస్తారని రెస్టారెంట్ యాజమాన్యం పేర్కొంది.

రెస్టారెంట్ లో తినాలంటే 30 వేల రూపాయలు చెల్లించాల్సిందే
ఈ రెస్టారెంట్‌లో ఒకేసారి 35-40 మంది కూర్చొని భోజనం చేయొచ్చు.ఇందులో వడ్డించే భోజనం కూడా సముద్ర వంటకాలే.18-కోర్స్ మీల్ ధర 380 యూరోలు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.30 వేల రూపాయలు ,కేవలం ఈ రెస్టారెంట్‌లో భోజనం చేయడం మాత్రమే కాదు.మెరైన్ బయాలజీపై అధ్యయనం చేయడానికి కావాల్సిన టూల్స్, కెమెరాలు ఇక్కడ ఉన్నాయి.
ఈ రెస్టారెంట్ లో భోజనాన్ని ఖర్చు ఎక్కువగా ఉన్న యూరోప్ ప్రజలు మాత్రం లెక్క చేయట్లేదు సముద్రం లో ఉన్న ఈ అండర్ రెస్టారెంట్ లో వెళ్లి అందులోని నూతన అనుభూతిని పొందలనుకుంటున్నారు.







