రేపు సంబరాలకు సిద్ధంగా ఉండాలని పిలుపు..: సజ్జల

కౌంటింగ్ కు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) అన్నారు.

ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి డిక్లరేషన్ తీసుకునే వరకు ఎవరూ బయటకు రావద్దని చెప్పామని సజ్జల పేర్కొన్నారు.రేపు సంబరాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చామని తెలిపారు.

కేసులను సుప్రీంకోర్టు కొట్టేసినా ఈసీ చేసింది తప్పేనని అందరికీ తెలుసని చెప్పారు.ఏపీలో పోస్టల్ బ్యాలెట్( Postal Ballot ) పై కొత్త నిబంధనలు పెట్టారని పేర్కొన్నారు.

చంద్రబాబు( Chandrababu) వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్న సజ్జల పొంతనలేని లెక్కలతో జాతీయ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయని తెలిపారు.ఈ క్రమంలోనే ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

Advertisement

బీజేపీ కలవకపోతే టీడీపీకి ఈ మాత్రం సీట్లు కూడా ఇచ్చేవారు కాదని తెలిపారు.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు