Smart TV Smart Speakers : స్మార్ట్ టీవీ కొన్న వారికి బంపరాఫర్.. ఖరీదైన స్మార్ట్ స్పీకర్ రూ.1999కే

ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకునే వారు పండగల వరకు ఆగుతారు.పండగల సమయంలో ఆఫర్లు ఉంటాయి.

ఒక్కోసారి 50 శాతం నుంచి 80 శాతం వరకు కూడా డిస్కౌంట్లు ఉంటాయి.పోటాపోటీగా వివిధ కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.

అందుకే పేద, మధ్య తరగతి ప్రజలు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటివి పండగ సమయంలో కొనుగోలు చేస్తుంటారు.ఎంఆర్‌పీ ధర రూ.50,000 ఉన్న వస్తువు ఆఫర్‌లో 25,000లకే వస్తుంది.దీంతో సగం ధరకే వచ్చే వస్తువు కోసం పండగ సమయం వచ్చే వరకు ప్రజలు వేచి చూస్తుంటారు.

ప్రస్తుతం దసరా, దీపావళి పండగలు ముగిసినా, చాలా కంపెనీలు ఇంకా ఆఫర్లు ప్రజలకు అందుబాటులోనే ఉంచాయి.తాజాగా స్మార్ట్ టీవీ కొన్న వారికి ఖరీదైన స్మార్ట్ స్పీకర్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

Advertisement

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు దీపావళి, దసరా సందర్భంగా పోటాపోటీగా భారీ ఆఫర్లను ప్రకటించాయి.

ఈ సమయంలో సేల్స్ భారీ ఎత్తున సాగాయి.ఇక టీవీల విషయంలో తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు కావాలంటే ఖచ్చితంగా ఎంఐ కంపెనీ టీవీలు అంతా కొనుగోలు చేస్తారు.

అందుకే వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎక్కువగా డిస్కౌంట్లు ఎంఐ కంపెనీ అందించింది.పండగ సీజన్ ముగిసినా ప్రజల కోసం వివిధ ఆఫర్లను అందుబాటులో ఉంచింది.

ముఖ్యంగా 5ఏ సిరీస్‌లో 32, 40, 43 అంగుళాల టీవీలను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.వీటి ధరలు వరుసగా రూ.13,999, రూ.21,999, రూ.24,999.ఈ సిరీస్‌లోని టీవీ కొన్న వారి కోసం స్మార్ట్ స్పీకర్‌ను తక్కువ ధరకే ఎంఐ కంపెనీ అందిస్తోంది.రూ.4999 ధర ఉన్న స్మార్ట్ స్పీకర్‌ను 5ఏ సిరీస్ టీవీ కొన్న వారికి రూ.1999కే అందిస్తోంది.గూగుల్ అసిస్టెంట్ ఇన్‌బిల్ట్‌గా ఈ స్మార్ట్ స్పీకర్‌లో ఉంటుంది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి

దీంతో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన 5ఏ సిరీస్ టీవీల విక్రయాలు పెరుగుతాయని ఎంఐ కంపెనీ భావిస్తోంది.కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

Advertisement

తాజా వార్తలు