దిల్ రాజు కష్టాలు

రాజా రాణి అనే క్లాసిక్ ఇచ్చిన డైరెక్టర్ , తుపాకి చిత్రంతో తెలుగునాట మంచి గుర్తింపు సాధించుకున్న విజయ్ హీరో కాబట్టి మంచి రేటు పెట్టి మరి “తెరి” తెలుగు హక్కులను కొనేసాడు అగ్రనిర్మాత దిల్ రాజు.పెట్టిన డబ్బులు రావాలంటే ఓపెనింగ్స్ కూడా బాగుండాలి కదా.

 Policodu Lands Into Title Troubles-TeluguStop.com

అందుకే బ్రహ్మాండమైన పబ్లిసిటి చేస్తున్నాడు.రిలీజ్ కూడా పెద్దదే.

నైజాంలో 120 థియేటర్లకు పైగా, రజినీకాంత్, శంకర్ పేర్లు లేని సినిమా విడుదల అవుతోందంటే మాటలా !


ఈ చిత్రానికి తెలుగులో “పోలీసోడు”అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ టైటిల్ వివాదాస్పదమైంది.

పోలిస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.గోపి రెడ్డి ఈ టైటిల్ మీద అసంతృప్తి వ్యక్తం చేసారు.ఈ టైటిల్ పోలీసు డిపార్ట్మెంట్ మనోభావాలను కించపరిచేలా ఉందని, దిల్ రాజు వెంటనే టైటిల్ లో మార్పు చేయాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.


ఇదిలా ఉంటే, తెరి ఈ రోజే తమిళనాడులో విడుదల అయ్యింది.

ఈ చిత్రానికి మిశ్రమ స్పందన దొరికింది.కొందరు బాగుంది అంటుంటే, మరికొందరు రొటీన్ గా ఉంది అంటున్నారు.

దీనితో దిల్ రాజు క్యాంప్ లలో టెన్షన్ మొదలైంది.తమిళ రివ్యూలు రేపు తెలుగు ఓపెనింగ్స్ మీద ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి.


Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube