సర్దార్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకే సారి విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించిన విషయం తెల్సిందే.అయితే హిందీ వర్షన్‌లోని పలు సీన్స్‌ తమ ‘దబాంగ్‌ 2’ను పోలి ఉన్నాయి అంటూ హిందీ నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌ లీగల్‌ నోటీసులు పంపించాడు.

 Screening Committee Green Signal To Pawan Sardaar-TeluguStop.com

దాంతో సినిమా విడుదలపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి.అయితే తాజాగా స్క్రీనింగ్‌ సభ్యులు ‘సర్దార్‌’తో పాటు ‘దబాంగ్‌ 2’ చిత్రాన్ని చూసి ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం లేదు అని, సీన్స్‌ను కూడా వాడినట్లుగా అనిపించలేదు అని నిర్ధారించారు.

దాంతో చిత్రం హిందీలో విడుదలకు మార్గం సుగమం అయ్యింది.

గతంలో హిందీలో తెరకెక్కిన ‘దబాంగ్‌’కు రీమేక్‌గా గబ్బర్‌సింగ్‌ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే.

ఇప్పుడు అదే టైటిల్‌తో సినిమా రావడంతో ‘దబాంగ్‌ 2’ సన్నివేశాలను ఎత్తేసి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.అయితే తాజాగా స్క్రీనింగ్‌ కమిటీ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో క్లారిటీ వచ్చేసింది.

ఈనెల 8న తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు.పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ నటిస్తోంది.

ఇక ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించగా, శరత్‌ మారర్‌ మరియు పవన్‌ కళ్యాణ్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.యూరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని హిందీలో ప్రేక్షకులకు అందిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube