పవన్ టార్గెట్ చాలా పెద్దది

బాహుబలి అనే సినిమా వచ్చి, ఇటు తెలుగుతో పాటు, తమిళ,మలయాళ,హిందీ మార్కేట్ లలో కూడా భారి కలెక్షన్లు వసూలు చేయడంతో, ఇప్పుడు తెలుగు హీరోలంతా వేరే భాషలపై పడ్డారు.శ్రీమంతుడు, తమిళ,మళయాళ భాషల్లో కూడా మంచి విజయం సాధించింది.

 Sardaar Gabbar Singh Simultaneously In Hindi And Tamil-TeluguStop.com

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తెలుగుతోపాటు తమిళ,మళయాళ భాషల్లో కూడా భారి ఎత్తున రిలీజ్ కాబోతోంది.మరి ముఖ్యంగా, మోహన్ లాల్ ఈ చిత్రంలో ఉండటం వల్ల .మళయాలంలో జనతా గ్యారేజ్ క్రేజ్ అదోరకంగా ఉంది.ఇక మహేష్ – మురుగదాస్ సినిమా ఎలాగో తమిళంలో ఒక పెద్ద సినిమాలాగా విడుదలవుతుంది .హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట.

తోటిహీరోలు ఇలా మార్కేట్ పెంచుకుంటుంటే నేను మాత్రం సైలెంట్ గా ఎందుకుండాలి అనుకున్నాడు పవర్ స్టార్.

అందుకే పెద్ద ప్లాన్ వేశాడు.సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగుతోపాటు, తమిళ,హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఇవాలో రేపో .మిగిలిన ఆ మళయాళ మార్కేటుని కూడా కలిపేసుకుంటారు.

ఇప్పుడు పవన్ టార్గేట్ శ్రీమంతుడు కాదు .అంతకు మించి.ఏటు చేసి 120-150 కోట్ల షేర్ కొల్లగొడదామని చూస్తున్నాడు పవర్ స్టార్.చూద్దాం .గబ్బరోడి తిక్కలో ఈసారి ఎంత మజా ఉందో, ఎన్ని రికార్డులు ఉన్నాయో!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube