అసద్ షాన్, యాంబర్ రోజ్ ప్రధాన పాత్రల్లో నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందించిన సినిమా \’లండన్ లైఫ్\’.లండన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ మేడారం మాట్లాడుతూ.\’\’హాలీవుడ్ లో సుమారుగా ముప్పై సినిమాలకు పని చేశాను.ఆ అనుభవంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాను.ఇండియా నుండి లండన్ వెళ్ళిన నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది.ఆ సమయంలో వాళ్ళకు ఎదురైన సంఘటనలను సినిమాగా రూపొందించాం.పూర్తిగా లండన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటుంది.
అభిషేక్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న హైదరాబాద్ లో రిలీజ్ చేస్తున్నాం.లండన్, అమెరికాలలో కె.వి పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం.ఐ.టి ఉద్యోగులు, ఫారెన్ లో చదువుకునే స్టూడెంట్స్ ను టార్గెట్ చేసి ఈ సినిమా చేశాం.ప్రస్తుతానికి నా దగ్గర ఎనిమిది స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్నాయి.
త్వరలోనే తెలుగులో ఒక సినిమా చేయబోతున్నాను\’\’ అని చెప్పారు.







