నందమూరి అభిమానుల మధ్య డిక్టేటర్ – నాన్నకు ప్రేమతో విడుదల డేట్ ల విషయం నుంచే మొదలైన గొడవ చిలికి చిలికి విడుదల సమయానికి గాలివాన గా మారింది.‘మా హీరో సినిమా సూపర్ హిట్.మీ హీరో సినిమా ఫట్.’ అంటూ సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్న అభిమానులూ ఓ రేంజ్లో ఫైటింగ్‌కి దిగుతున్నారు.ట్విట్టర్, ఫేస్బుక్ అన్న తేడాల్లేవు.ఆఖరికి వాట్సాప్‌ని కూడా వదలడంలేదు.
సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా అంటే నందమూరి ఫాన్స్ కి పండగే కానీ అదే సమయంలో ఎన్టీఆర్ రావడంతో మొదలైంది అసలు గొడవ, నాన్నకు ప్రేమతో తరవాతనే డిక్టేటర్ రావడం థియేటర్ ల సమస్య కూడా ఎక్కువగా వచ్చింది.ఎన్టీఆర్‌కి ఓవర్సీస్లో ‘నాన్నకు ప్రేమతో’ మంచి హిట్ ఇస్తుందన్న టాక్ సినీ వర్గాల్లో విన్పిస్తోంది.
మాస్ ఆడియన్స్‌ని సంక్రాంతి సీజన్లో మేగ్జిమమ్ ‘డిక్టేటర్’ అలరించడం ఖాయమని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమకు ఈ రెండు సినిమాల హిట్లూ అవసరమే.
ఈ రెండే కాదు, చిన్న సినిమా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’తోపాటు, ఇవాళ (15 జనవరి) విడుదల కానున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కూడా హిట్ అవ్వాలనే సినీ రంగంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.అయితే, అభిమానులందు దురభిమానులు వేరు కదా.!
వాళ్ళతోనే చిక్కు వచ్చిపడ్తోంది.సినిమా హిట్టయితే, కాసుల పంట పండుతుంది.
లేదంటే చేదు అనుభవాన్ని మిగుల్చుతుంది.హిట్టు సినిమాని ఫ్లాప్ అన్నా, ఫ్లాప్ సినిమాని హిట్ అన్నా.
అసలు ఫలితంలో తేడా వచ్చేయదుకదా.ఆ సంగతి ఎలాగూ సోమవారానికి డిసైడ్ అయిపోతుంది.
ఈలోగా దురభిమానుల కామెంట్ల పైత్యం పీక్స్‌కి వెళ్ళిపోవడం బాధాకరమే.సినిమాలు రెండూ విడుదలయ్యాక అభిమానులు కూల్ అయిపోతారని అంతా అనుకున్నారు.
దురదృష్టవశాత్తూ ఆ పైత్యం మరింత ముదిరిపోయింది.







