పండగ సినిమాల హడావిడి మొదలైంది.థియేటర్ సమస్యలు ఉండగానే విడుదల కోసం నాలుగు పెద్ద సినిమాలు ఒకేసారి రంగంలోకి దూకుతున్నాయి.
థియేటర్ ల సమస్య అలా ఇలా లేదు.తమకు రెండు థియేటర్లు కావాలని పట్టుపడుతున్నారు కొందరి సినిమా జనాలు.
ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాల పోటీ వచ్చింది.
తమంతట తాము కలగజేసుకున్నారో లేక నిర్మాతల ఒత్తిడి మేరకు తగులుకున్నారో కానీ కొన్ని సెంటర్ లలో థియేటర్ ల ఇష్యూ విషయంలో స్వయంగా ఎమ్మెల్యే లు రంగంలోకి దిగడం ఆశ్చర్యకరం గా మారింది.
తమ ప్రాంత బయ్యర్ల కోసమో, లేదా లోకేష్ మెచ్చుకుంటారనో, లేదా మరేమైనా ఆదేశాలు వున్నాయో కానీ, డిక్టేటర్ కు అనుకూలంగా ఎమ్మెల్యేలు కలుగచేసుకుని, థియేటర్లు ఇప్పిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.ముందే అగ్రిమెంట్ అయిపొయింది అని చెప్పడానికి కూడా థియేటర్ ల వారికి ఉండడం లేదు దానికీ ఒక కారణం ఉంది.
పండుగ సందర్భంగా కనీసం వారం పది రోజుల పాటు ఫ్లాట్ రేట్లు అమ్మడం అలవాటు.అలాంటి వ్వవహారాన్ని అధికారుల చూసీ చూడనట్లు వదిలేయాలంటే, ఎమ్మెల్యేల అండదండలు తప్పని సరి.సో కొన్ని థియేటర్ లలో మార్నింగ్ షో, ఫస్ట్ షో, మాట్నీ, సెకెండ్ షో అనే విధంగా విడదీసి రెండు సినిమాలు వేయడం లేదా ఎర్లీ మార్నింగ్ షో తో ఫ్రారంభించి అయిదు ఆటలు వేసి, మూడు ఓ సినిమా, రెండు ఓ సినిమా వేయడం లాంటి అడ్జస్ట్ మెంట్ లు చేయాలనుకుంటున్నాయట.ఇలాంటి వాటికి రాజకీయ నాయకుల అండ ఉండి తీరాల్సిందే మరి.







