మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తని ఒరువన్’ రీమేక్ అవ్వబోతున్న విషయం తెల్సిందే.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
భారీ అంచనాలున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లబోతుంది.ఈ చిత్రంకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
మొన్నటి వరకు గోవాలో స్క్రిప్ట్‌ను రెడీ చేసిన దర్శకుడు తాజాగా హీరోయిన్ మరియు నటీ నటుల ఎంపికలో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.మొదట ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్ ఆ తర్వాత సమంతల పేర్లు వినిపించాయి.
హెబ్బా పటేల్ పేరును సైతం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చింది.
‘నేను శైలజ’ చిత్రంతో తమిళం నుండి దిగుమతి అయిన కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.భారీ అంచనాలున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ అయితే సరిగ్గా సూట్ అవుతుందనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ మరియు అల్లు అరవింద్ సైతం ఉన్నట్లుగా తెలుస్తోంది.
తమిళంలో ఇప్పటికే నటిగా నిరూపించుకున్న కీర్తి సురేష్ తెలుగులో కూడా మొదటి చిత్రం ‘నేను శైలజ’తో సక్సెస్‌ను అందుకుంది.దాంతో మెగా హీరో శైలజపై ఆసక్తిని కనబర్చుతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ రీమేక్‌లో కీర్తి సురేష్ నటిస్తే టాలీవుడ్‌లో ఆమె క్రేజ్ మరింత పెరగడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.







