మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవలే ‘కంచె’ మరియు ‘లోఫర్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ రెండు చిత్రాలు కూడా వరుణ్‌కు మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి.
ఈ చిత్రాల తర్వాత వరుణ్ నటించబోతున్న సినిమాపై అందరి దృష్టి కేంద్రీకృతం అయ్యి ఉంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ తన తర్వాత సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్నాడు అని తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం దర్శకుడు క్రిష్ ‘రాయబారి’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్ చేయించిన విషయం తెల్సిందే.ఆ టైటిల్‌తో మొదట అక్కినేని హీరో అఖిల్‌తో సినిమా చేస్తాడు అంటూ ప్రచారం జరిగింది.
కాని తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఆ సినిమా తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది.
వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడిగా పేరున్న క్రిష్ ఈసారి ‘రాయబారి’ చిత్రంలో హీరోను జేమ్స్‌బాండ్ తరహాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
మెగా హీరోల్లో జేమ్స్‌బాండ్ పాత్రకు సరిగ్గా సూట్ అయ్యేది వరుణ్ తేజ్ మాత్రమే అని, అందుకే వరుణ్‌ను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది.క్రిష్ ప్రస్తుతం ‘రాయబారి’ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
ఇక ఈ చిత్రం కోసమే వరుణ్ తేజ్ స్పెషల్‌గా గడ్డం పెంచుతున్నట్లుగా తెలుస్తోంది.కొత్తగా వరుణ్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు అని, టాలీవుడ్‌లో జేమ్స్‌బాండ్ పాత్రకు వరుణ్ మాత్రమే సరిగ్గా సూట్ అవుతాడు అంటూ మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.







