అవును బ్రహ్మోత్సవం ట్రెండ్ సెట్ చేస్తుంది అంట.ఈ మాట అన్నది కాజల్ అగర్వాల్.
బ్రహ్మోత్సవం మాటేమో కాని, ఇదే మహేష్ బాబు – శ్రీకాంత్ అడ్డాల కలయికలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మాత్రం నిజంగానే ట్రెండ్ సెట్ చేసింది.ఆ సినిమా వల్లే మల్టిస్టారర్లు తెలుగు సినిమాలో ఊపందుకున్నాయి.
ఆరకంగా వేరే వాళ్లకు దారి చూపించారు మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల.అయితే ఇప్పుడు బ్రహ్మోత్సవం కుడా ట్రెండ్ సెట్ చేస్తుందని నొక్కి చెబుతోంది కాజల్.
” తెలుగు సినిమాలు అంటే అదోరకంగా చూసేవాళ్లకి బ్రహ్మోత్సవం గొప్ప సమాధానం.ఈ సినిమా ఖచ్చింతంగా ట్రెండ్ సెట్ చేస్తుంది.
ఇందులో ఉన్న ఫ్యామిలి ఎమోషన్స్ మాటల్లో చెప్పలేనివి.చాలా గొప్పగా ఉంటాయి.
నేను ఇందులో ఎన్నారైగా కనిపిస్తాను.ఈ సినిమాలో ఒక్కో పాత్రకు ఒక్కో స్వభావం ఉంటుంది.
ఆ స్వభావాలు, వాటి ద్వారా వచ్చే భావోద్వేగాలే ఈ సినిమా” అంటూ చెప్పుకొచ్చింది కాజల్.
నిజంగానే సినిమాలో అంత విషయం దాగుందో, లేదా మీడియా అడగ్గానే ఎదో చెప్పాలని చెప్పిందో తెలియాలంటే వచ్చే వేసవి దాకా ఆగాల్సిందే.
ఎందుకంటే అప్పుడే బాక్సాఫీస్ దగ్గర బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి.








