మెగా హీరో వరుణ్ తేజ్ ‘లోఫర్’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఈ సినిమాకు ఫలితంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ఈ చిత్రానికి రేపు బాలీవుడ్‌లో విడుదల అవ్వబోతున్న రెండు సినిమాల నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘దిల్‌వాలే’ మరియు ‘బాజీ రావు మస్తానే’ చిత్రాలు రేపు విడుదల కాబోతున్నాయి.
ఈ రెండు సినిమాలపై తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ముఖ్యంగా ‘బాజీరావు మస్తానే’ చిత్రాన్ని బాలీవుడ్ ‘బాహుబలి’ అంటూ ప్రచారం చేయడంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
దాంతో ‘బాజీరావు మస్తానే’ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేశారు.దిల్‌వాలే సినిమా కూడా తెలుగులో మల్టీప్లెక్స్ థియేటర్లలో భారీ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది.
అందువల్లే ఈ రెండు సినిమాల వల్ల ‘లోఫర్’కు గండం తప్పదు అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.







