భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రుద్రమదేవి’ చిత్రం బడ్జెట్ కూడా వసూళ్లు చేయకుండానే ‘బ్రూస్‌లీ’ చిత్రం విడుదల అయ్యింది.పలువురు సినీ ప్రముఖులు ‘బ్రూస్‌లీ’ చిత్రాన్ని వాయిదా వేయాలని, ‘రుద్రమదేవి’ చిత్రానికి పోటీగా విడుదల చేయవద్దని కోరారు, డిమాండ్ చేశారు.
కాని ముందే డేట్ నిర్ణయించడంతో పాటు, విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో ‘బ్రూస్‌లీ’ని ఆపకుండా నేడు విడుదల చేశారు.దాంతో ‘రుద్రమదేవి’ కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం ఖాయం.
‘బ్రూస్‌లీ’ వారం గ్యాప్‌లోనే మరో మెగా మూవీ ‘కంచె’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బ్రూస్‌లీ’కి యావరేజ్ టాక్ వచ్చింది.
దాంతో వారం రోజుల్లో బడ్జెట్ రికవరీ అంటే కాస్త కష్టమే.రెండు వారాలు సోలోగా బాక్సాఫీస్ వద్ద కొనసాగితే ‘బ్రూస్‌లీ’కి లాభాల పంట పండటం ఖాయం.
కాని మరో మెగా మూవీ ‘కంచె’ వస్తుండటంతో మెగా వర్సెస్ మెగా తప్పదని సినీ వర్గాల వారు అంటున్నారు.‘కంచె’ చిత్రంకు సక్సెస్ టాక్ వచ్చి, కమర్షియల్‌గా సక్సెస్ అయితే ‘బ్రూస్‌లీ’కి పెద్ద దెబ్బ తప్పదని అంటున్నారు.
ఈనెల 22న విడుదల కాబోతున్న ‘కంచె’ చిత్రం ‘బ్రూస్‌లీ’కి ఎంత మేరకు నష్టం చేస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.







