ఇది కళ్యాణ ద్రోహం!!

పలు సార్లు పవన్‌ కళ్యాణ్‌ను ఆకాశానికి ఎత్తేలా ట్వీట్‌లు చేసిన వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఈసారి మాత్రం పవన్‌పై విమర్శలు చేస్తూ ట్వీట్‌లు చేశాడు.తనకు సబంధం ఉన్న, లేని విషయాలపై వర్మ ఎప్పటికప్పుడు ట్వీట్‌లు చేస్తూనే ఉంటాడు.

 Rgv Controversial Tweets On Pawan Kalyan-TeluguStop.com

తాజాగా ఈయనకు పవన్‌ కళ్యాణ్‌ విషయం ఎందుకు గుర్తుకు వచ్చిందో కాని, ప్రశ్నిస్తానన్న పవన్‌ కళ్యాణ్‌ పత్తా లేడేంటి అనే ఉద్దేశ్యంతో ట్వీట్‌ చేశాడు.ప్రస్తుతం వర్మ ట్వీట్‌ ఎప్పటిలాగే హాట్‌ హాట్‌గా మారి పోయింది.

వర్మ ట్విట్టర్‌లో పవన్‌ కళ్యాణ్‌ పేరు ప్రస్థావించకుండా అందరికి తెలిసేలా.ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు లోక కళ్యాణానికి ద్రోహమ్‌.

ఇది కళ్యాణ ద్రోహం అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు.గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారంలో పవన్‌ కళ్యాణ్‌ స్పందించాలని, చంద్రబాబు నాయుడును ఈ విషయమై ప్రశించాలని ఆయన అభిమానులతో పాటు సాధారణ జనాలు సైతం కోరుతున్నారు.

కాని ఇప్పటి వరకు కూడా పవన్‌ కళ్యాణ్‌ స్పందించింది లేదు.ఇదే విషయాన్ని వర్మ కూడా ఈ ట్వీట్‌తో చెప్పుకొచ్చాడు.

మరి ఇప్పటికి అయినా పవన్‌ స్పందిస్తాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube