సింగం వర్సెస్‌ ఆంధ్రాపోరి

గత వారం ప్రేక్షకుల ముందుకు ‘రాక్షసుడు’ మరియు ‘పండగచేస్కో’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఈ రెండు సినిమాలు కూడా యావరేజ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి.

 Andhra Pori Vs Singham 123-TeluguStop.com

ఈ రెండు సినిమాలకు పెద్దగా పోటీ లేక పోవడంతో ఈ వారం మొత్తం ఈ రెండు సినిమాల హవా సాగే అవకాశాలున్నాయి.ఇక ఈ వారంలో మూడు సినిమాలు విడుదలయ్యే అవకాశాలున్నాయని అంతా అనుకున్నారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘జాదూగాడు’ విడుదల వాయిదా పడటంతో, ‘సింగం123’ మరియు ‘ఆంధ్రాపోరి’లు మాత్రమే రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి.

ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

‘హృదయకాలేయం’ వంటి కామెడీ సినిమా తర్వాత బర్నింగ్‌ స్టార్‌ సంపూర్నేష్‌బాబు నటించిన ‘సింగం 123’ సినిమాను మంచు విష్ణు నిర్మించడంతో ఒక్కసారిగా ఈ సినిమాకు క్రేజ్‌ పెరిగింది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది.

ఇక డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ తనయుడు ఆకాష్‌ పూరి హీరోగా తెరంగేట్రం చేస్తున్న ‘ఆంధ్రాపోరి’పై కూడా తెలుగు ప్రేక్షకులు ఆసక్తితో ఉన్నారు.మరాఠి సినిమా ‘టైంపాస్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా కూడా ఈ వారం భారీగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

జూన్‌ 5న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడబోతున్నాయి.మరి ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుందో చూడాలి.

లేకుంటే గత వారం మాదిరిగానే రెండు సినిమాలు కూడా యావరేజ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube