మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు రంగం సిద్దం అవుతోంది.ఇప్పటికే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.
ఆగస్టు నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్న రామ్‌చరణ్ ప్రకటించాడు.దాంతో ఇప్పుడు అందరి దృష్టి చిరు రీ ఎంట్రీ ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఉంది.
గతంలో పలు రకాల పాత్రలు చేసిన చిరు 150వ సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తాడు అని ఎక్కడ చూసినా చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు ‘ఆటో జానీ’ అంటూ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
టైటిల్‌ను చూస్తుంటే ఈ సినిమాలో చిరు జానీగా, ఆటో డ్రైవర్‌గా కనిపించే అవకాశాలున్నాయని తెలిసి పోతుంది.ఇక సినిమా మొదటి సగంలో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న 40 సంవత్సరాల వ్యక్తిగా కనిపిస్తాడట.
సినిమా మొదటి సగంలో ఫుల లెంగ్త్ మాస్ మసాలా, కామెడీని పూరి జగన్నాధ్ చూపించనున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇక సెండ్ హాఫ్‌లో కామెడీతో పాటు కాస్త ఎమోషన్ సీన్స్‌ను కూడా జొప్పించనున్నారు.
మొత్తానికి చిరంజీవి నవ్వించేందుకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా తేలాల్సి ఉంది.