ప్రతివారికీ పక్కవాడితో ఎప్పుడో అప్పుడు అవసరం పడుతుంది.ఏదో ఒక సందర్భంలో సాయం కోరాల్సి వస్తుంది.
అందేకే అనవసరంగా మాట్లాడి సాయం చేసేవారిని దూరం చేసుకోకూడదు.ఆమధ్య నేపాల్‌లో భారీ భూకంపం వచ్చి దాదాపు ఎనిమిదివేల మంది చనిపోయినప్పుడు, దేశం శ్మశానంగా మారినప్పుడు ముందుగా స్పందించింది భారత్.
భూకంపం వచ్చిన సమాచారం కూడా ప్రపంచానికి తెలియకముందే భారత్ నుంచి సహాయక దళాలు నేపాల్‌కు వెళ్లాయి.మోదీ సర్కారు చాలా వేగంగా స్పందించి అన్నివిధాల ఆదుకుంది.
ఈ విషయంలో అనేక దేశాలు భారత్‌ను ప్రశంసించాయి కూడా.ఓ పక్క సహాయక చర్యలు సాగుతుండగానే ‘మీ సాయం మాకు అక్కర్లేదు.
తక్షణం వెళ్లిపోండి’ అని నేపాల్ ప్రభుత్వం భారత్ సహా అన్ని దేశాల వారిని ఆదేశించింది.నిన్న మళ్లీ రెండుసార్లు భారీ భూకంపం వచ్చి కొంతమేరకు ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలిగాయి.
కాని భారత్ నుంచి సహాయక బృందాలు వెళ్లలేదు.సహాయ సామగ్రిని కూడా పంపలేదు.
సహాయం కోసం నేపాల్ ప్రభుత్వం అభ్యర్థిస్తే ఆలోచిస్తామని అధికారులు చెప్పారు.అధికారుల ఇలా చెప్పినా మరో పక్క సహాయక బృందాలను, విమానాలను, హెలిక్యాప్టర్లను సిద్ధం చేసి ఉంచారు.
నేపాల్ చాలా చిన్న దేశం.భూకంపం కారణంగా అది పూర్తిగా నాశనమైంది.
ఇప్పట్లో కోలుకోవడం సాధ్యం కాదు.సహాయం లేకుండా నిలదొక్కుకోవడం అసాధ్యం.
ఈ విషయం తెలిసి కూడా నేపాల్ ప్రభుత్వం ‘మీ సాయం అక్కర్లేదు’ అనడం పొరపాటు.ఇలాంటి సమయంలో ఇగో సమస్య వస్తే అది ఆ దేశానికే నష్టం.







