యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో పలు మంచి పనులు చేసిన విషయం తెల్సిందే.సేవా కార్యక్రమాల్లో ముందు ఉండే ఎన్టీఆర్ తాజాగా క్యాన్సర్‌తో భాదపడుతున్న శ్రీనిధిని కూకట్ పల్లిలోని రామ్ దేవ్ హాస్పిటల్‌లో కలుసుకున్నాడు.
చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న శ్రీనిధికి ఎన్టీఆర్‌ను చూడాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది.ఆమె చిన్న తనం నుండి కూడా ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం.
ఆ ఇష్టంతోనే క్యాన్సర్ బారిన పడ్డా కూడా ఎన్టీఆర్‌ను చూడాలని కోరుకుంది.ఆమె కోరికను తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే ఆ పాపను పలకరించేందుకు రామ్‌దేవ్ హాస్పిటల్‌కు వెళ్లాడు.
హాస్పిటల్‌లో శ్రీనిధితో కొంత సమయం గడిపిన ఎన్టీఆర్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ… ఇలాంటి ఆపద ఎవరికి రాకూడదు.పాప తల్లిదండ్రులు ఎంతలా ఆందోళన పడుతున్నారో అనే విషయం నేను అర్థం చేసుకోగలను.
నాకు ఒక కొడుకు ఉన్నాడు.నన్ను కలవడం ద్వారా ఆ పాప సంతోషంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో కలిసేందుకు వచ్చాను.
ఆమె సంతోషంతో క్యాన్సర్‌ను జయించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.అందరి ముందు శ్రీనిధి మళ్లీ సంతోషంతో తిరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు.
శ్రీనిధి తల్లిదండ్రులకు ధైర్యంను చెప్పాడు.ఎన్టీఆర్ రాకతో శ్రీనిధి సంతోషాన్ని వ్యక్తం చేసింది.







