తెలంగాణ సెంటిమెంట్‌తో ‘హోరాహోరీ’

తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌లను అందుకున్న తేజ ప్రస్తుతం అంతా కొత్త వారితో ‘హోరా హోరీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

గత కొంత కాలంగా సక్సెస్‌కు దూరం అయిన తేజ ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు.

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాణం అన్ని తానై ఈ సినిమాకు పని చేస్తున్నాడు తేజ.ఇక ఈ సినిమాతో పలువురు కొత్త టెక్నీషియన్స్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నట్లుగా తేజ చెప్పుకొచ్చాడు.ఈ సినిమాకు పని చేస్తున్న టెక్నీషియన్స్‌ అంతా కూడా తెలంగాణకు చెందిన వారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో తెలంగాణ వారికి సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు ఆశించిన స్థాయిలో రావడం లేదని, తెలంగాణ వారిలో ఉన్న ట్యాలెంట్‌ను సినిమా వారు గుర్తించడం లేదు అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో తన సినిమాకు అంతా తెలంగాణ టెక్నీషియన్స్‌ను తీసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.తెలంగాణ పిల్మ్‌ చాంబర్‌ నుండి గుర్తింపు ఉన్న టెక్నీషియన్స్‌ను తాను ‘హోరా హోరీ’కి పని చేయించినట్లుగా తేజ చెప్పుకొచ్చాడు.

తెలంగాణ వారిలో కూడా మంచి ప్రతిభావంతులు ఉన్నారని చెప్పడానికే తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తేజ ప్రకటించాడు.తేజ ‘హోరా హోరీ’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు