ప్రధాని విందులో ప్రత్యేకత లేదు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు శనివారం రాత్రి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన విందుకుఎంతో హుషారుగా హాజరయ్యారు.ఢిల్లీకి వచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి అశోకా హోటల్‌కు చేరుకుని తన ఎంపీలను కలుసుకున్నారు .

 Chandrababu Attends Pm Modi’s Dinner Party-TeluguStop.com

అయితే ప్రధాని విందు ప్రేత్యేకంగా బాబు రాలేదు .అందుకే రాష్ట్ర వ్యవహారాలూ మాట్లాడేందుకు ఏమి ఉండదని తెలియడం తో పార్టీ లో పలువురు పెదాలు విరిచారు .సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తి, సుప్రీంకోర్టు జడ్జిలు, వివిధ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మర్యాదపూర్వక విందును ఇచ్చారు.న్యాయవ్యవస్థలోని సంస్కరణలు, పెం డింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించటం, న్యాయమూ ర్తులకు వేతనాలు, ఇతర సౌకర్యాలు, పదవీవిరమణ తర్వాత వారి పరిస్థితి వివిధరకాల అంశాలపై ఢిల్లీలో గత మూడు రోజుల నుంచి సదస్సు జరుగుతుంది.

ఈ సమావే శంలో న్యాయమూర్తులు ఇచ్చే సలహాలు, సూచనలను తీసుకుని కేసులను వేగంగా పరిష్కరించటమే కేంద్రం, సర్వోన్నత న్యాయస్థానం ముందున్న ప్రధాన లక్ష్యం.దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల సంఖ్యల్లో కేసులు పెండింగ్‌ లో ఉండటం, కొంత మంది అమాయకులు కూడా జైళ్ళలో మగ్గిపోవటం, కేసులు పరిష్కారం కాకుండా లాంగ్ పెండింగ్లో ఉంటున్నాయి .కనుక దీనిపై తక్షణ చర్యలకు ప్రధాని తలపెట్టారు అందుకే ఈ మీట్ ఏర్పాటు చేసారని తెలిసింది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube