ఈరోజు తెలంగాణా శాసన సభలో మంత్రి టి హరిశరావు మాట్లాడుతూ ఖమ్మం లో విభజన నాడు ఇష్టానుసారం కాంగ్రెస్ చేసేస్తున్నప్పుడు అడ్డు చెప్పి ఉంటె నేడు నీటి బాధలు 7మండలాలకు ఆ జిల్లాకు ఉండేవి కావు.ఆనాడు నోరుమె దపడానికి లేదన్నట్లు ఊరుకున్నారు మన ముందున్న కాంగ్రెస్ పెద్దలు అని చెప్పారు.
దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం చెప్పినా హరీశ్ రావు తనదైన శైలిలో మాట్లాడారు .ఇప్పుడు సీలేరు ప్రాజెక్టు నుంచి నీళ్ళు తెలంగాణాకు రాకుండా పొయాయి.అయితే మనకు రావలిసిన వాటా నీళ్ళను వదిలే ప్రసక్తే లేదు.అందుకు నేను ఈసరికే కేంద్రం ముందు తెలంగాణా వాటా గురుంచి సంప్రదింపులు జరుపుతున్నాను.కేంద్రం సానుకూలంగానే రెండు రాష్ట్రాలను సరిగ్గా చూస్తామని సమానంగానె గుర్తిస్తామని తెలిపినట్లు చెప్పారు .







