పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్‌లు కలిసి నటించిన ‘గోపాల గోపాల’ సినిమా భారీ అంచనాల నడుమ తెరకెక్కి, విడుదలైన విషయం తెల్సిందే.ఈ చిత్రం విడుదలకు ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
అయితే ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది.దాంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన పంపిణీదారులు నష్టాలు చవి చూడాల్సి వచ్చిందని చెబుతున్నారు.
ఈ సినిమాను నిర్మించిన సురేష్‌బాబు మరియు శరత్ మరార్‌లు టేబుల్ ప్రాఫిట్ దక్కించుకున్నా కూడా ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు స్వల్పంగా నష్ట పోయినట్లుగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మోడ్రన్ శ్రీకృష్ణుడిగా కనించాడు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ శ్రియ మరియు దీక్షా పంథ్‌లు నటించారు.రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూళ్లు చేస్తుందనుకున్న ఈ సినిమా కేవలం 45 కోట్ల వద్ద కలెక్షన్స్ ముగించుకున్నట్లుగా తెలుస్తోంది.







