ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వివాహ విందులో వంటవాడు ఫర్మాన్ చేసిన పని వల్ల పెద్ద కలకలం రేగింది.ఘజియాబాద్‌లో భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైద్పూర్ గ్రామంలో ఫిబ్రవరి 23న వినోద్ కుమార్ కుమార్తె వివాహం జరిగింది.
ఈ వివాహానికి విందు భోజనాలు సిద్ధం చేయడానికి హిందూ కుటుంబం ఫర్మాన్ అనే వంటవాడిని ఆహ్వానించింది.అయితే ఈ పెళ్లి వేడుక ఓవైపు జరుగుతుండగా.
మరోవైపు వివాహ విందు కోసం వచ్చిన వారు తినేందుకు తయారు చేస్తున్న రోటీల పిండి ముద్దపై ఉమ్మి వేస్తూ, రొట్టెలు తయారు చేస్తున్న ఫర్మాన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అతను తాండూర్ మీద రొట్టెలు తయారు చేస్తూ, ఉమ్మితో కలుపుతున్న దృశ్యాలను కొంతమంది మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు.
ఈ వీడియో బయటకు రావడంతో వధూవరులతో పాటు పెళ్లికి హాజరైన అతిథులందరూ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.

ఈ ఘటనపై మోడీనగర్ ఏసీపీ జ్ఞాన్ ప్రకాష్ రాయ్ స్పందించారు.పోలీసులు నిందితుడు ఫర్మాన్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘజియాబాద్‌లో ఇదేమీ కొత్త కాదు.ఇంతకుముందు కూడా ఇలాంటి వీడియోలు వెలుగు చూసాయి.
గత ఘటనలు కూడా ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి.ఇటువంటి ఘటనలపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇలాంటి చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.వంటకాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే, అది ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది.
ప్రజలు ఇలాంటి సంఘటనలను గమనించి తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే విందు కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.







