అయ్యబాబోయ్.. అలా ఎలా బీరు బాటిల్‌ బ్యాలెన్స్ చేశావయ్యా!

సోషల్ మీడియాలో రోజూ పలు రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.వినూత్నమైన, వినోదభరితమైన వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

 Man Driving Scooty With Balance Beer Bottle On His Head Viral Video, Viral Video-TeluguStop.com

ముఖ్యంగా, ఎవరికీ సాధ్యంకాని సాహసాలు, విచిత్ర విన్యాసాలు చేసే వ్యక్తుల వీడియోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంటాయి.ఇలాంటి వీడియోలు చూస్తూ “ఇదెలా సాధ్యం?” అని ఆశ్చర్యపోతుంటాం.తాజాగా, ఇలాంటి ఆసక్తికరమైన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తూ బీరు బాటిల్‌తో చేసిన స్టంట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.

సాధారణంగా స్కూటీపై ప్రయాణించడం ప్రత్యేకమైనది కాదు.కానీ, అతను తలపై బీరు బాటిల్‌ను పెట్టుకుని స్కూటీని వేగంగా నడుపుతూ కనిపించాడు.

బీరు బాటిల్‌ను(Beer Bottle ) తలపై నిలబెట్టి, స్కూటీని డ్రైవ్(Scooty Ride) చేస్తూ చాలా దూరం ప్రయాణించాడు.అతడి ఈ విచిత్ర విన్యాసం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ తమ స్పందనను తెలుపుతున్నారు.“పవర్ ఆఫ్ 90 ఎమ్ఎల్” అంటూ కొందరు సరదాగా కామెంట్లు పెడుతుండగా.మరికొందరు “మందుబాబులకు ఇలాంటి విన్యాసాలు మాములే ” అంటూ ఫన్నీ గా కామెంట్స్ రాస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

వ్యక్తి చేసిన స్టంట్‌పై కొన్ని సరదా కామెంట్లు, వివిధ రకాల ఎమోజీలతో నెటిజన్లు తమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియోలో చూపిన విన్యాసం అందరికీ నవ్వు తెప్పిస్తుంది, అలానే కొంత మందికి భయం కూడా కలిగిస్తుంది.

మరి మీకు ఎం అనిపించిందో ఓ కామెంట్ చేయండి.ఇలాంటి స్టంట్లు, ముఖ్యంగా రోడ్డుపై వెళ్తూ చేసే సాహసాలు చాలా ప్రమాదకరమైనవే.సాధారణ ప్రజలు ఇలాంటి ప్రయత్నాలు చేయడం ప్రమాదకరం.కాబట్టి, భద్రతా చర్యలను పాటించడం, రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించడం ముఖ్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube