స్టార్ డైరెక్టర్ శంకర్( Star Director Shankar ) ఒకప్పుడు ఎలాంటి సినిమాలను తెరకెక్కించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.శంకర్ ఒకప్పుడు నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు.అయితే గత కొంతకాలంగా ఈ దర్శకుడికి సరైన సక్సెస్ అయితే లేదనే సంగతి తెలిసిందే.ఇండియన్2, గేమ్ ఛేంజర్ ( Indian2, game changer )సినిమాలు శంకర్ కెరీర్ కు ఒక విధంగా శాపంగా మారాయి.ఈ రెండు సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి.
గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి శంకర్ 5 గంటల ఫుటేజీ తీశారంటే ఈ సినిమా విషయంలో షూట్ సమయంలోనే ఎంత పెద్ద తప్పు జరిగిందో సులువుగానే అర్థమవుతుంది.
శంకర్ మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం గేమ్ ఛేంజర్ మూవీ ఫలితం మరో విధంగా ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గేమ్ ఛేంజర్ మూవీ దిల్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చింది.

శంకర్ కెరీర్ ఇండియన్3 ( Indian3 )రిజల్ట్ పై ఆధారపడి ఉందని ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే శంకర్ కు పూర్వ వైభవం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఇండియన్3 కచ్చితంగా హిట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.మరోవైపు చరణ్ సైతం గతంలో ఫ్లాప్స్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

లైఫ్ అంటే అనుభవాల పరంపర అని తప్పులు తప్పవని పేర్కొన్నారు.అయితే ఆ తప్పులను రిపీట్ చేయకుండా ఉండటమే కీలకం అని చరణ్ చెప్పుకొచ్చారు.సమయం అన్నింటికీ సమాధానం చెబుతుందని తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని కాలంతో పాటు ప్రతిదీ సరిగ్గా మారుతుందని రామ్ చరణ్ పేర్కొన్నారు.
రామ్ చరణ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.