చిన్నోడితో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్న పెద్దోడు... సంక్రాంతికి వస్తున్నాం టీమ్ తో మహేష్!

సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతూ ఉంటాయి.అయితే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా స్టార్ హీరోల సినిమాలు వరుసగా విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేశాయి.

 Mahesh Babu Attened Sankranthiki Vastunnam Movie Success Celebrations, Mahesh Ba-TeluguStop.com

ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki  vastunnam) సినిమా ఒకటి.డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్ (Venkatesh ) , మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల అయింది.

Telugu Anil Ravipudi, Mahesh Babu, Venkatesh-Movie

ఇలా ఈ సినిమా మొదటి రోజు నుంచి ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ మంచి సక్సెస్ అందుతుంది.ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) పాల్గొని సందడి చేశారు.ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Anil Ravipudi, Mahesh Babu, Venkatesh-Movie

ఇలా సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందంతో మహేష్ బాబు పాల్గొనడంతో అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ చిన్నోడితో పెద్దోడి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ ఆయన అనంతరం మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి ప్రత్యేకంగా  అభినందనలు తెలియజేస్తూ పోస్ట్ చేసారు.ఇక అనిల్ రావిపూడి వెంకటేష్ తో మహేష్ బాబుకి(Mahesh Babu with Anil Ravipudi Venkatesh) ఉన్న అనుబంధం నేపథ్యంలోనే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారని తెలుస్తుంది.అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు.

ఇక వెంకటేష్ తో కలిసి ఈయన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube