యూకేలోని మాంచెస్టర్‌లో( Manchester ) దారుణం జరిగింది.ఆసుపత్రి వార్డులోనే భారత సంతతికి చెందిన నర్స్‌పై( Nurse ) ఓ రోగి కత్తెరతో దాడి చేయగా .
ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.శనివారం గ్రేటర్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ హామ్ రాయల్ హాస్పిటల్‌లో( Oldham Royal Hospital ) అక్యూట్ మెడికల్ యూనిట్‌లో భారత మూలాలున్న 57 ఏళ్ల అచమ్మ చెరియన్( Achamma Cherian ) అనే నర్సు విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ క్రమంలో రోహన్ హక్ (37) ( Roman Haque ) అనే రోగి తాను అడిగింది చేయలేదనే కోపంతో ఆమెపై దగ్గరలో ఉన్న కత్తెరతో విచక్షణారహితంగా దాడి చేశాడు.

దీంతో వెంటనే స్పందించిన తోటి సిబ్బంది అచమ్మకు ప్రథమ చికిత్స అందించి అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.నిందితుడు రోహన్ హక్‌ను ఘటనా స్థలంలోనే పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం మాంచెస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
దీంతో అతనిపై హత్యాయత్నం, ఆయుధాన్ని కలిగి ఉండటం వంటి పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.తదుపరి విచారణ నిమిత్తం ఫిబ్రవరి 18న మిన్‌షల్ స్ట్రీట్ క్రౌన్ కోర్టులో రోమన్ హక్‌ను హాజరుపరచనున్నారు.

అచమ్మ చెరియన్ దాదాపు పదేళ్లుగా ఆ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు.ఆమెను ఇండియన్ అసోసియేషన్ ఓల్డ్ హామ్ (ఐఏవో) చురుకైన, ప్రజాదరణ పొందిన సభ్యురాలిగా పేర్కొంది.ఆమె తన భర్త అలెగ్జాండర్ చాండీతో కలిసి హాస్పిటల్‌కు దగ్గరలోనే నివసిస్తున్నట్లు డైలీ మెయిల్ తెలిపింది.నైట్ షిఫ్ట్‌లలోనూ అచమ్మ క్రమం తప్పకుండా డ్యూటీలకు హాజరయ్యేదని స్థానికులు, ఇతర ఉద్యోగులు చెబుతున్నారు.
స్థానిక మంత్రి ఓల్డ్ హామ్ వెస్ట్ ఎంపీ జిమ్ మెక్ మహన్ ఈ ఘటనను ఖండించారు.అలాగే బ్రిటీష్ ఇండియన్ నర్సుల సంఘం (బినా) ఛైర్మన్ మారిమౌటౌ కుమారస్వామి కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆసుపత్రిలో అచమ్మకు తగినంత సంరక్షణ లభిస్తుందని.అలాగే ఇది జాతి విద్వేష ఘటన కాదని కుమారస్వామి తెలిపారు.







