గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.ఈమె పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.
ఈమె పెళ్లి ముహూర్తం కూడా ఇప్పటికే ఫిక్స్ అయ్యింది.వచ్చే నెలలో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది కీర్తి సురేష్.
ఈ మేరకు ఆమె శుక్రవారం స్వయంగా వెల్లడించారు.ఇది ఇలా ఉంటే కీర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని( Tirumala Srivaru ) దర్శించుకున్నారు.
స్వామి వారి సేవలో పాల్గొన్నారు.దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా పెళ్లి ముచ్చట బయటపెట్టారు.వచ్చే నెలలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు.గోవాలో( Goa ) వెడ్డింగ్ జరుగుతుందని అన్నారు.
ఇక తాను నటిస్తున్న హిందీ సినిమా కూడా వచ్చే నెలలో విడుదల కానుందని, అందుకే స్వామివారి దర్శనం కోసం వచ్చానని తెలిపారు.బేబీ జాన్ షూట్ పనుల్లో కీర్తి సురేశ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
ఈ సినిమాతో ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.వరుణ్ ధావన్ హీరోగా ఇది తెరకెక్కుతోంది.కోలీవుడ్‌లో విడుదలైన తెరీ రీమేక్‌గా ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.మరోవైపు కీర్తి సురేశ్ ఇటీవల తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.తన స్నేహితుడు ఆంటోనీతో( Antony ) ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు.
ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపారు.