ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకులు చాలా మంది ఉన్నారు.అయితే కన్నడ సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నది అలాంటి ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చి సూపర్ సక్సెస్ లను అందుకుంటున్న దర్శకుడు ప్రశాంత్ నీల్…( Director Prashanth Neel ) ఆయనకి ఒక యూనిక్ స్టైల్ ఉంది అందులోనే సినిమాలు చేస్తూ ఉంటాడు…
కే జి ఎఫ్( KGF ) సినిమాతో పాన్ ఇండియాలో తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్… ఇక ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నాయనే చెప్పాలి.
మరి అలాంటి దర్శకుడు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఈయన సినిమాలు డార్క్ మోడ్ లో ఉంటాయి.
కాబట్టి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు ఒక డిఫరెంట్ అనుభూతిని పొందుతాడు.కానీ వరుసగా అలాంటి సినిమాలు చేయడం వల్ల ప్రేక్షకుడిలో కొంతవరకు బోర్ ఫీల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
కాబట్టి ప్రశాంత్ నీల్ ఫుల్ సినిమాని చేస్తే చూడాలని యావత్ ఇండియన్ సినిమా జనాలందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు.నిజానికి ఆయన కలర్ ఫుల్ సినిమాలను చేయడానికి ఇష్టపడడు.
మసి పూసుకొని, మట్టిలో దొర్లే క్యారెక్టర్లు అంటేనే తనకు ఇష్టమని ఒక సందర్భంలో తెలియజేశాడు.మరి ఇప్పుడు అలాంటి పాత్రలు చేయడం వల్ల సినిమా చూసే ప్రేక్షకులకు కొంత వరకు బోర్ కొట్టొచ్చు.కాబట్టి ఆ సినిమా స్టైల్ ని మార్చి చూపిస్తే అప్పుడు ప్రతి ప్రేక్షకుడు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.కాబట్టి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కీలకం…
అలాగే ఏ జానర్లో సినిమా చేస్తున్నాం ఎలాంటి సినిమా చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ కీలకపాత్ర వహిస్తుందనే చెప్పాలి… ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పాన్ ఇండియాలో డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు.కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ తో( NTR ) చేయబోయే డ్రాగన్ సినిమా( Dragon Movie ) కూడా అదే జానర్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఆయన అదే స్టైల్ కి అలవాటు పడ్డాడు కాబట్టి అలాంటి సినిమాలనే చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశాలైతే ఉన్నాయి.
మరి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక కలర్ ఫుల్ సినిమాని చూడాలనుకునే ప్రేక్షకులు కొంతవరకు నిరాశ చెందాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చాలా మంచి రెస్పెక్ట్ అయితే ఉంది.
ఎందుకు అంటే ఎక్కడో చిన్న కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాను శాసించే స్థాయికి ఎదిగిన ప్రశాంత్ నీల్ ను చూస్తే యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరూ గర్వంగా ఫీల్ అవుతారనే చెప్పాలి…
.