తెలుగు సినిమా పేరు చెప్పగానే ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తొస్తున్నారు.నిజానికి వాళ్ళు చేసే సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ లను సాధిస్తున్నాయి.
అందువల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు తమకు నచ్చిన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.నిజానికి వాళ్ళు చేసే ప్రతి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచే విధంగా ఉంటుంది.

ముఖ్యంగా స్టార్ హీరోలు అయిన ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నటులు వాళ్ళు చేసే సినిమాలను ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తూ భారీ కలెక్షన్లను కొల్లగొడుతున్నారు.నిజానికి అయితే ప్రభాస్ ( Prabhas )లాంటి నటుడు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.ఇక ఇప్పటికే ఆయన పాన్ ఇండియాలో భారీ సినిమాలను రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు.బ్యాక్ టు బ్యాక్ 500 కోట్లకు పైన కలెక్షన్లను సాధించిన సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.

ఇక ప్రస్తుతం ఆయన రాజాసాబ్ సినిమా( The RajaSaab )తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అయితే మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను రేకెత్తిస్తుంది.ఇక్కడి వరకు బాగానే ఉంది.కానీ ప్రభాస్ హను రాఘవపూడి తో చేస్తున్న ఫౌజీ సినిమా( Fauji movie ) మీద భారీ అంచనాలు ఉన్నప్పటికి ఈ సినిమాకి సంబంధించిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
ఇక ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని ప్రభాస్ అభిమానులు మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేసి భారీ సక్సెస్ లను సాధిస్తున్నాడు…
.







