బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం చందుర్తి మండల బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలను అమలు చేయడంతో పాటు రైతులకు ఇచ్చిన హామీ 15 వేల రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.