బెంగళూరులోని( Bengaluru ) శంకర్ నగర్ లో ఉన్న గణేష్ దేవాలయం( Ganesh Temple ) వద్దా ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.ఈ దేవాలయంలో శ్లోకాలు చేస్తున్న సమయంలో ఒక దొంగ( Thief ) అక్కడికి వచ్చాడు.
కిటికీ ఆనుకొని కూర్చున్న మహిళను గమనించాడు.ఆమె మెడలో బంగారపు గొలుసు( Gold Chain ) ఉందని తెలుసుకున్నాడు.
బయటనుంచే కిటికీ కడ్డీల మధ్యలో నుంచి ఆ మహిళ మెడలోని గొలుసు గట్టిగా లాగేసాడు.అది తెగి రావడంతో దాన్ని పట్టుకొని వేగంగా అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ ఘటన అక్టోబర్ 10న జరిగింది.అక్కడే ఉన్న మరో భక్తురాలు ఈ దొంగతనాన్ని తన మొబైల్ ఫోన్‌తో రికార్డ్ చేశారు.దేవాలయం కిటికీ వద్ద కూర్చున్నావా ఆ మహిళ తన మెడలోని గొలుసు దోచేయడంతో చాలా భయపడింది.గొలుసు మెడకు ఒత్తుకుపోవడం, ఆపై తెగిపోవడం, అది దొంగతనానికి గురైందని తెలుసుకోవడం చకచకా జరిగిపోయాయి.
ఆ క్షణంలో ఆ మహిళ భయంతో అరుస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.ఈ ఘటనతో శంకర్ నగర్( Shankar Nagar ) ప్రాంతంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
వైరల్ వీడియోలో, బ్లూ కలర్ శారీ కట్టుకున్న వృద్ధ మహిళ కిటికీ దగ్గర కూర్చుని ఇతర భక్తులతో కలిసి శ్లోకాలు చదువుతోంది.అంతలోనే, కిటికీ బయట నుండి ఒక వ్యక్తి తన చేతిని దూర్చి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ ను లాగేస్తాడు.దొంగ సుమారు 30 గ్రాముల బరువున్న ఆ చైన్ లో సగం భాగాన్ని లాగేసుకుని అక్కడి నుండి పారిపోతాడు.ఈ దొంగతనం చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది.
ఈ ఘటన జరిగిన తర్వాత ఆ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది.సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్న పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని దొంగ కోసం గాలిస్తున్నారు.
దేవాలయం లాంటి పవిత్ర స్థలంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం చూసి సమాజంలోని భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి.ఈ టెంపుల్ వద్ద ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికలు కోరుతున్నారు.