రెమ్యూనరేషన్స్ భారీ గా పెంచుతున్న స్టార్ హీరోలు...ఇలా అయితే ప్రొడ్యూసర్స్ కి నష్టాలు తప్పవా..?

ప్రస్తుతం మన స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా లో భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇదిలా ఉంటే వాళ్లు ప్రతి ఒక్కరు వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతూ సినిమా ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నారు.

 The Star Heroes Who Are Increasing The Remunerations Hugely... But This Is The L-TeluguStop.com

కాబట్టి ఇలాంటి సందర్భంలో మన స్టార్ హీరోలందరూ వాళ్ళ రెమ్యూనరేషన్స్ ను భారీగా పెంచుతున్నారు.మరి దీనివల్ల ప్రొడ్యూసర్స్ కి ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా అంటూ మరి కొంతమంది ప్రొడ్యూసర్స్ తరుపున మాట్లాడుతున్నారు.

Telugu Allu Arjun, Kalki, Mahesh Babu, Prabhas, Producers, Tollywood-Movie

నిజానికైతే హీరోని చూసే ప్రేక్షకులు ఆ సినిమా చూడడానికి థియేటర్ కి వస్తారు.కాబట్టి హీరోలకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్స్( Remunerations ) పే చేసి నిర్మాతలు ఆ సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.నిజానికి సినిమా హిట్ అయితే నిర్మాతలు భారీగా డబ్బులను వెనకేసుకుంటారు.ఒకవేళ నష్టం వస్తే మాత్రం కొంతవరకు వాళ్లు నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.మరి ఇలాంటి సందర్భంలో భారీ విజయాలను అందుకున్న హీరోలు సైతం తమదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నారు.

 The Star Heroes Who Are Increasing The Remunerations Hugely... But This Is The L-TeluguStop.com
Telugu Allu Arjun, Kalki, Mahesh Babu, Prabhas, Producers, Tollywood-Movie

ఇక ప్రస్తుతం ప్రభాస్ ( Prabhas )లాంటి స్టార్ హీరోలు ఒక్క సినిమా కోసం 200 కోట్లకు పైన రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి మొత్తానికైతే ప్రభాస్ లాంటి స్టార్ హీరో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి ఇప్పటికి కూడా చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.కానీ ఆయన చేసిన బాహుబలి 2 సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాడు.

కాబట్టి ఆయనకు 200 కోట్లు ఇవ్వడానికి కూడా ప్రొడ్యూసర్లు వెనకాడడం లేదు.ఎందుకంటే ప్రభాస్ కి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే ఉంది.ఆ మార్కెట్ ని క్యాష్ చేసుకోవాలంటే మాత్రం భారీ బడ్జెట్ పెట్టక తప్పదు అనే విధంగా ప్రొడ్యూసర్లు ఆలోచిస్తూ ఉండటం విశేషం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube