12 ఏళ్లుగా డైలీ 30 నిమిషాలే నిద్ర.. చివరికి ఈ జాపనీస్ వ్యక్తికి ఏమైందంటే..?

మన శరీరం బాగా పని చేయాలంటే ప్రతి రోజు 6 నుండి 8 గంటలు నిద్రపోవాలి.చాలా తక్కువ నిద్రపోతే మనం చిరాకుగా, కోపంగా ఉంటాము.

 This Japanese Man Only Slept 30 Minutes A Day For 12 Years Details, Sleep, Good-TeluguStop.com

మన పనులు సరిగా చేయలేము.డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, ప్రతి రోజు 6 నుంచి 8 గంటలు నిద్రపోతే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది.

మనం చాలా బాగా ఆలోచించగలము.మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.

కానీ ఒకవేళ ఒక వ్యక్తి రోజుకు కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతే ఏమవుతుంది? ఆరోగ్యం సర్వనాశనం అవుతుంది కదా కానీ జపాన్( Japan ) దేశానికి చెందిన డైసుకే హోరీ( Daisuke Hori ) అనే వ్యక్తి విషయంలో అలా జరగలేదు.

డైసుకే గత 12 సంవత్సరాలుగా ప్రతి రోజు కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు.

అతని ప్రకారం, ఇలా చేయడం వల్ల తన జీవితాన్ని రెట్టింపు చేయవచ్చట.హ్యోగో ప్రాంతానికి( Hyogo ) చెందిన ఈ 40 ఏళ్ల వ్యక్తి తన శరీరం, మనస్సును చాలా తక్కువ నిద్రతో బాగా పని చేసేలా ట్రైనింగ్ ఇచ్చుకున్నాడు.

ఈ అలవాటు వల్ల తాను పనిలో చాలా సమర్థవంతంగా ఉన్నానని అతను చెప్పాడు.

Telugu Daisuke Hori, Hyogo, Japan, Japanshort, Japanese, Nri, Quality Sleep, Sho

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌తో డైసుకే హోరీ మాట్లాడుతూ “భోజనం చేయడానికి ఒక గంట ముందు వ్యాయామం చేస్తే లేదా కాఫీ తాగితే నిద్ర వస్తుందనే భావన రాదు.” అని చెప్పాడు.డైసుకే ఒక ఉద్యోగస్తుడు.

అతని అభిప్రాయం ప్రకారం, ఎక్కువ సేపు నిద్రపోవడం కంటే మంచి నాణ్యత గల నిద్ర పోవడం( Quality Sleep ) చాలా ముఖ్యం.డాక్టర్లు, అగ్నిమాపక సిబ్బంది లాంటి వారు పనిలో చాలా అప్రమత్తంగా ఉండాలి కదా, అందుకే వారు తక్కువ సేపు నిద్రపోయినా బాగా పని చేయగలుగుతారు.

ఎందుకంటే వారి నిద్ర నాణ్యత ఎక్కువ.

Telugu Daisuke Hori, Hyogo, Japan, Japanshort, Japanese, Nri, Quality Sleep, Sho

జపాన్‌లోని యోమియూరి టీవీ ఛానల్ డైసుకే ఎలా జీవిస్తున్నాడో చూపించే ఒక రియాలిటీ షో చేసింది.ఈ షో పేరు “విల్ యు గో విత్ మీ?”.వారు మూడు రోజుల పాటు డైసుకేని గమనించారు.

ఒక ఎపిసోడ్‌లో డైసుకే కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయి, తర్వాత చాలా ఉత్సాహంగా లేచి, బ్రేక్‌ఫాస్ట్ చేసి, పనికి వెళ్లి, జిమ్ కూడా వెళ్లాడు.ఇది నమ్మడానికి కష్టంగా ఉన్నా, అదే జరిగింది.

2016లో డైసుకే జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించాడు.అక్కడ అతను నిద్ర, ఆరోగ్యం గురించి తరగతులు నిర్వహిస్తున్నాడు.

ఇప్పటికే 2,100 మందికి పైగా విద్యార్థులు అతనిలాగే చాలా తక్కువ నిద్రపోవడం ఎలాగో నేర్చుకున్నారు.అల్ట్రా-షార్ట్ స్లీపర్స్‌కు ఎందుకు ఎలాంటి అనారోగ్యం కలగడం లేదో సైంటిస్ట్ లు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube