సాధారణంగా దర్శకులు తాము రెడీ చేసుకున్న కథకు ఫలానా హీరో సూట్ అవుతాడని అనుకుంటారు.వారిని కాంటాక్ట్ అయ్యి కథ కూడా వినిపిస్తారు.
అయితే దర్శకుడు తన కోణంలో ఆ హీరో తన కథకు సూట్ అవుతాడని అనుకుంటాడు.కానీ హీరో మాత్రం తాను ఆ పాత్ర చేయలేనని భావిస్తాడు.
అలానే అది తనకు సెట్ కాదని కూడా కరెక్ట్ గా అంచనా వేయగలుగుతాడు.అప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది.అయితే కొంతమంది హీరోలు ఇలా రిజెక్ట్ చేయడమే కాకుండా దర్శకుల మేలు కోసం వేరే హీరోలా పేర్లను సలహా ఇస్తుంటారు.
బాలకృష్ణ
యాక్షన్ థ్రిల్లర్ మూవీ భీమ్లా నాయక్( Bheemla Nayak ) (2022) సినిమాలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించగా సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించారు.ప్రధాన పాత్రలు పోషించాడు.అయితే ఈ సినిమా స్టోరీ ముందుగా బాలకృష్ణ వద్దకు వెళ్లింది.కానీ దాన్ని ఆయన రిజెక్ట్ చేశాడు.అది నాకు సెట్ కాదని, పవన్ కళ్యాణ్ అయితే ఇందులోని పాత్రకి బాగా సూట్ అవుతారని కూడా సలహా ఇచ్చారట.
ఆ విధంగా ఈ మూవీ పవన్ చేతికి వచ్చింది.మలయాళ మూవీ “అయ్యప్పనుమ్ కోషియుమ్”కి అఫీషియల్ రీమేక్.
జూనియర్ ఎన్టీఆర్
‘ఉప్పెన’ సినిమా( Uppena ) దర్శకుడు బుచ్చిబాబు సనా తన రెండవ సినిమాకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని హీరోగా అనుకున్నాడు.సుకుమార్ సమయంతో అతనిని మీట్ అయ్యాడు.సినిమా స్టోరీ కూడా వినిపించాడు.అయితే ఈ మూవీ తనకంటే రామ్ చరణ్ కి బాగా సూట్ అవుతుందని తారక్ సలహా ఇచ్చాడట.రామ్ చరణ్‌కి కథ నచ్చడంతో ఒప్పుకున్నాడు.దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో RC16 మూవీ రాబోతోంది.
సూర్య
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సూర్య( Suriya )తో ఒక సినిమా తీద్దామని భావించాడు.కానీ సూర్య ఆ మూవీ తనకి సెట్ కాదని చెప్పేసాడట.అంతేకాదు ప్రభాస్‌ను హీరోగా తీసుకుంటే బాగుంటుందని సలహా కూడా ఇచ్చాడు.దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతోందని సమాచారం.ఆ మూవీ టైటిల్ ఇంకా ప్రకటించలేదు.