టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు సుకుమార్ ( Sukumar )కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.సుకుమార్ ఏ సినిమా తెరకెక్కించినా ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే.
సుకుమార్ భార్య తబిత సమర్పకురాలిగా వ్యవహరించిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా( Marutinagar Subrahmanyam movie ) మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్( Pre release event ) లో సుకుమార్ రహస్యాలు వెల్లడయ్యాయి.సుకుమార్ భార్య తబిత( Tabitha ) ఈ సీక్రెట్స్ ను రివీల్ చేశారు.
సుకుమార్ ఆర్గానికి ఫుడ్ ఎక్కువగా తింటాడని ట్రావెలింగ్ అంటే సుకుమార్ కు చాలా ఇష్టమని సుకుమార్ పుష్ప ది రూల్ సినిమాలో సూసేకి అగ్గిరవ్వ మాదిరి సాంగ్ లో ఎలా చెప్పారో అలా ఉంటాడని తెలిపారు.పైకి సీరియస్ గా కనిపించినా సుకుమార్ లోపల సాఫ్ట్ అని ఆమె పేర్కొన్నారు.
సుకుమార్ కు సంబంధించిన ఈ సీక్రెట్స్ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.పుష్ప1 సక్సెస్ సాధించడంతో పుష్ప ది రూల్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.పుష్ప3 కూడా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.పుష్ప2 రిజల్ట్ ను బట్టి పుష్ప3 విషయంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
బన్నీ సినిమాకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందా? లేదా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.అల్లు అర్జున్ కు నార్త్ లో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా పుష్ప ది రూల్ నార్త్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.పుష్ప2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.