వీడియో: పాకిస్థాన్‌లోని ఐకానిక్ రెస్టారెంట్ మూసివేత.. గుండె పగిలిన ఉద్యోగులు..

ఇస్లామాబాద్‌( Islamabad )లోని పర్వతాల మీద ఉన్న అక్రమంగా నిర్మించిన కమర్షియల్ బిల్డింగ్స్, రెస్టారెంట్లను మూసివేయాలని ఇటీవల పాక్‌ కోర్టు చెప్పింది.అక్కడ పని చేసే వాళ్ళందరూ ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుంది.

 Supreme Court Ordered Demolition Illegal Construction Of Margalla Hills Nationa-TeluguStop.com

కొంతమంది గుండె పగులుతున్నారు.ఈ విషయం వాళ్లకు చాలా బాధగా కలిగిస్తోంది.

ముఖ్యంగా ఇస్లామాబాద్‌లోని చాలా ప్రముఖ మొనల్ రెస్టారెంట్‌ను పాకిస్తాన్ సుప్రీంకోర్టు( Pakistan Supreme Court ) మూసివేయాలని ఆదేశించింది.మొనల్ రెస్టారెంట్‌ మార్గల్లా హిల్స్ నేషనల్ పార్క్ ప్రదేశంలోని అక్రమంగా ఆక్రమించిన భూమి మీద కట్టడం జరిగిందని సుప్రీంకోర్టు వెల్లడించింది.

ఈ ఆదేశం వల్ల మొనల్ రెస్టారెంట్( Monal Restaurant ) శాశ్వతంగా క్లోజ్ చేయడం జరిగింది.దీని ఫలితంగా అక్కడ పనిచేసే అందరి ఉద్యోగులను పని నుండి తొలగించారు.ఉద్యోగులకు తొలగింపు లేఖలు ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియో చూసిన చాలా మందికి అయ్యో పాపం అని కామెంట్లు చేస్తున్నారు.ఈ రెస్టారెంట్ కట్టిన పర్వతాలు అడవులతో నిండి ఉన్నాయి, వాటిని కాపాడాలి అని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అందుకే ఆ రెస్టారెంట్లలో పనిచేసే వాళ్ళందరూ మూడు నెలల లోపు అక్కడ నుండి వెళ్ళిపోవాలి.

ఈ విషయం తెలిసి చాలా మంది ఉద్యోగులు ఏడుస్తున్నారు.కొంతమందికి బాధ తట్టుకోలేక స్పృహ తప్పింది.ఇలాంటి దృశ్యాలకు సంబంధించిన ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు.ఆ వీడియోను 82 లక్షల మందికి పైగా చూశారు.“అతను తన కుటుంబ బాధ్యతల గురించి చింతించి స్పృహ కోల్పోయాడు” అని ఒకరు అన్నారు.“వారు లేబర్ కోర్టుకు వెళ్లొచ్చు లేదా వేతనాల కోసం కేసు వేయొచ్చు” అని మరొకరు సూచించారు.“ఇది బాధాకరమైన విషయమే, కానీ ఉద్యోగులకు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికి సమయం ఉంది” అని ఒకరు అన్నారు.“వారు కోట్ల రూపాయలు సంపాదించారు, ఇప్పుడు వారిని వదిలేశారు” అని మరొకరు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube