ప్యారిస్ ఒలింపిక్స్ లో ముగిసిన భారత్ పతకాల వేట..

పారిస్ ఒలింపిక్స్ 2024లో( Paris Olympics 2024 ) భారత్ పతకాల ముగిసింది.రితికా హుడా 76 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో సెమీ ఫైనల్స్‌ లో కిర్గిజ్‌స్థాన్ రెజ్లర్ అపరి కైజీని ఓడించి పతక జాబితా నుండి నిష్క్రమించింది.

 Manu Bhaker To Aman Sehrawat Indias Medal Winners At Paris Olympics 2024 Details-TeluguStop.com

ఒకవేళ కిర్గిస్థాన్ రెజ్లర్ ఫైనల్స్‌కు చేరి ఉంటే.రిపిచేజ్ ద్వారా రితికా కాంస్యం గెలిచే అవకాశం ఉండేది.

రితికా హుడా పతకాల రేసు నుంచి తప్పుకోవడంతో ప్రస్తుత ఒలింపిక్ క్రీడల్లో భారత్ ప్రయాణం ముగిసింది.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్( India ) మొత్తం ఆరు పతకాలు సాధించింది.

ఇందులో ఐదు కాంస్యం, ఒక రజతం ఉన్నాయి.అథ్లెటిక్స్‌లో రజత పతకం వచ్చింది.

షూటింగ్‌లో భారత్‌ మూడు కాంస్య పతకాలు సాధించగా.రెజ్లింగ్‌, హాకీల్లో ఒక్కో కాంస్యం సాధించింది.

అయితే రెజ్లర్ వినేష్ ఫోగట్( Vinesh Phogat ) విషయంలో భారత్‌కు అనుకూలంగా నిర్ణయం వస్తే.పతకాల సంఖ్య ఏడుకు చేరడం ఖాయం.

వినేష్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎలాంటి స్వర్ణ పతకమూ దక్కలేదని అధికారికంగా నిర్ధారణ అయింది.

స్వర్ణం లేకుండా, భారతదేశం తన ప్రయాణాన్ని ముగించించింది.

Telugu Medals, Aman Sehrawat, Indiamedal, Manu Bhaker, Neeraj Chopra, Olym, Pari

పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను భాకర్( Manu Bhaker ) కాంస్యం సాధించడంతో భారత్‌కు షూటింగ్‌లో తొలి పతకం లభించింది.ఆపై మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్‌కు రెండో కాంస్యం కూడా లభించింది.అతనితో పాటు సరబ్‌జోత్ సింగ్( Sarabjot Singh ) కూడా జట్టులో ఉన్నాడు.

పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ షూటింగ్‌లో స్వప్నిల్ కుసాలే( Swapnil Kusale ) మూడో కాంస్య పతకాన్ని సాధించాడు.ఆపై పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా( Neeraj Chopra ) రజత పతకాన్ని గెలుచుకున్నారు.

ఆ తర్వాత పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో రెజ్లర్ అమన్ సెహ్రావత్( Aman Sehrawat ) కాంస్యం సాధించాడు.

Telugu Medals, Aman Sehrawat, Indiamedal, Manu Bhaker, Neeraj Chopra, Olym, Pari

టోక్యో ఒలింపిక్స్ (2020)లో భారతదేశం 7 బంగారు పతకాలు సాధించిందని.ఇది ఒలింపిక్ చరిత్రలో ఇప్పటివరకు భారతదేశ అత్యుత్తమ ప్రదర్శన.ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి భారత్ పతకాల సంఖ్య రెండంకెలకు చేరుతుందని అంతా భావించారు.

అయితే, అంచనాలకు విరుద్ధంగా జరిగింది.పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఒక్క బంగారు పతకాన్ని కూడా గెలవలేకపోయింది.

అంతేకాకండా పతకాల సంఖ్య 6 వద్ద నిలిచిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube