సినిమా ఇండస్ట్రీలో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.ఈ ఇండస్ట్రీలో చాలామంది సెంటిమెంట్లను సైతం నమ్ముతారు.
బాలయ్యకు( Balayya ) హిట్ ఇచ్చిన హీరోయిన్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు( Jr NTR ) మాత్రం ఫ్లాప్ ఇచ్చింది.ఆ హీరోయిన్ ఎవరో కాదు స్టార్ హీరోయిన్ శృతి హాసన్( Shruti Haasan ) కావడం గమనార్హం.
శృతి హాసన్ అటు బాబాయ్ తో నటించడంతో పాటు ఇటు అబ్బాయ్ తో కూడా నటించింది.
ఎన్టీఆర్, శృతి కాంబినేషన్ లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో రామయ్యా వస్తావయ్యా సినిమా( Ramayya Vasthavayya ) తెరకెక్కగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలను నిలువునా ముంచేసింది.
బాలయ్య, శృతి హాసన్ కాంబోలో బాబీ డైరెక్షన్ లో వీరసింహారెడ్డి సినిమా( Veerasimha Reddy ) తెరకెక్కగా ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.ఇలా బాబాయ్ కు హిట్ ఇచ్చిన శృతి అబ్బాయికి మాత్రం హిట్ ఇవ్వలేదు.
అటు బాలయ్య ఇటు ఎన్టీఆర్ శృతి హాసన్ కు మరో ఛాన్స్ కూడా ఇవ్వలేదు.శృతి హాసన్ ప్రస్తుతం సలార్ 2 సినిమాలో నటిస్తుండగా ఈ బ్యూటీ విజయ్ తో సైతం ఒక సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.శృతి హాసన్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉందని సమాచారం అందుతోంది.శృతి హాసన్ వరుస సక్సెస్ లను అందుకుని కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
శృతి హాసన్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మరో మూడు నాలుగేళ్లు వరుస ఆఫర్లను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.సోషల్ మీడియాలో శృతికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.శృతి హాసన్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.శృతి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.