సాధారణంగా ప్రైవేట్ పార్ట్స్‌కి సంబంధించి సర్జరీ చేసేటప్పుడు ఎలాంటి వీడియో రికార్డ్ చేయకూడదు.అసలు అనుమతి లేకుండా ఒకరి సర్జరీ విజువల్స్‌ను ఎవరూ లీక్ చేయకూడదు.
అయితే చైనాకు చెందిన గావో ( Gao )అనే మహిళకు మాత్రం ఈ విషయంలో అన్యాయం జరిగింది.ఈమె ఐదు నెలల క్రితం సెంట్రల్ చైనాలోని ఒక కాస్మెటిక్ సర్జరీ ఆసుపత్రిలో బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ ( Breast implant surgery )చేయించుకుంది.
ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, ఆమె సర్జరీ వీడియో చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ డౌయిన్‌లో అప్‌లోడ్ అయింది.
వీడియోలో గావో సర్జరీ తర్వాత, భారీగా బ్యాండేజ్‌లు ధరించి, ఇంకా అనస్థీషియాలో ఉన్నట్లు కనిపించింది.
ఈ వీడియో 28,000 లైక్స్, 39,000 షేర్లతో వైరల్ అయింది.గావో తన ప్రైవసీని తీవ్రంగా ఉల్లంఘించారని చెబుతోంది.
ఈ వీడియోను ఎవరు చిత్రీకరించారో గుర్తించాలని, వీడియోను తొలగించాలని ఆమె ఆసుపత్రిని పదే పదే సంప్రదించింది.ఆసుపత్రి గావో అభ్యర్థనను తిరస్కరించింది.
ఘటన జరిగిన మూడు నెలల తర్వాత సెక్యూరిటీ ఫుటేజీని పోలీసులు నాశనం చేసినందున నిందితుడిని గుర్తించడం అసాధ్యమని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది.
అయితే సదరు బాధితురాలు మాత్రం ఆపరేషన్ థియేటర్లు సాధారణంగా వైద్య సిబ్బంది మాత్రమే ఉండే అత్యంత భద్రత కలిగిన ప్రదేశాలు అని, అందువల్ల నిందితుడిని గుర్తించడం ఆసుపత్రికి సాధ్యమేనని వాదించింది.అయితే, నిందితుడిని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగిందని వారి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అతని వద్ద లేదని ఆసుపత్రి బదులిచ్చింది.
ఈ సమాధానంతో సంతృప్తి చెందని గావో ఆసుపత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.ఈ ఘటన ఆన్‌లైన్‌లో ఆగ్రహాన్ని రేకెత్తించింది, చాలా మంది ఆసుపత్రి ప్రతిస్పందనను ఖండించారు.దాని బాధ్యత గురించి ప్రశ్నించారు.
హెనాన్‌లోని టియాన్‌క్సిన్ లా ఫిర్మ్‌కు చెందిన న్యాయవాది మా బిన్ దీని గురించి మాట్లాడుతూ వీడియోను మాజీ ఉద్యోగి లేదా బయట వ్యక్తి రికార్డు చేసినా, రోగుల ముఖాలను చూపించే వీడియోలను సమ్మతి లేకుండా పోస్ట్ చేయడం నేరమని నొక్కిచెప్పారు.