కల్కి సినిమాకి( Kalki ) మొదటి రోజు 300 కోట్లకు పైన కలెక్షన్లు వస్తాయని అందరు అనుకున్నారు.కానీ అందరూ ఊహలను తలకిందులు చేస్తూ ఈ సినిమాకి అంత కలెక్షన్స్ అయితే రాలేదు.
ఇక 200 కోట్లకు పైన వరకు మాత్రమే ఈ సినిమా కలెక్షన్లు రాబట్టింది.అయితే ఈ సినిమాకి కలెక్షన్స్ తగ్గడం ఏంటి అనే విషయం మీద ప్రభాస్ ( Prabhas )అభిమానులు అందరూ ఆరాధిస్తున్నారు.
ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ సినిమాకి నైట్ ఒంటి గంటకి వేసే బెనిఫిట్స్ వేయకుండా ఆపేశారట.
అందువల్ల ఈ సినిమాకి కలెక్షన్స్ భారీగా తగ్గాయని సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక దానికి గల కారణాలు ఏంటి అంటే రాత్రి ఒంటిగంటకు షో లు వేస్తే చాలామంది తాగేసి వచ్చి సగటు ప్రేక్షకులను సినిమా చూసే సమయంలో ఇబ్బంది పెడుతున్నారట.ఇక దాంతో పాటుగా సిబ్బందితో కూడా గొడవకు దిగుతున్నారని అలాగే స్క్రీన్ పైన హీరో కనిపిస్తే స్క్రీన్ ముందుకెళ్ళి డాన్స్ చేస్తూ వీలైతే స్క్రీన్ ని నష్టపరిచే అవకాశాలు కూడా ఉన్నాయనే ఉద్దేశ్యం తో వాళ్లు ఒంటిగంటకు వేసే బెనిఫిట్ షోని క్యాన్సల్ చేసి నాలుగు గంటలకు బెనిఫిట్ షో ను వేశారట.
ఇక దాని వల్ల ఈ సినిమాకి చాలా వరకు కలెక్షన్స్ తగ్గాయని మరి కొంతమంది వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు… రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ( 95 crore gross collections )రావటం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.ఇక ఇప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా మరోసారి భారీ ఎత్తున కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు…
.