ప్రభాస్, నాగ్ అశ్విన్( Prabhas, Nag Ashwin ) అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన కల్కి ట్రైలర్ ఎట్టకేలకు నిన్న రాత్రి విడుదలైంది.క్రిటిక్స్ నుంచి, ప్రముఖ రివ్యూవర్ల నుంచి ట్రైలర్ గురించి పాజిటివ్ టాక్, పాజిటివ్ కామెంట్లు వినిపించాయి.
కల్కి మేకర్స్ ( Kalki Makers )అన్ని వర్గాల ప్రేక్షకులను ట్రైలర్ తో మెప్పించడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.ట్రైలర్ కమల్ లుక్ కూడా కొత్తగా ఉంది.
ఇప్పటివరకు కమల్ పోషించిన రోల్స్ కు భిన్నమైన రోల్ లో ఈ సినిమాలో కనిపించనున్నారు.
అయితే దీపికా పదుకొనే( Deepika Padukone ) డబ్బింగ్, కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ విషయంలో మాత్రం మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.
ఇవే కల్కి ట్రైలర్ కు మైనస్ పాయింట్స్ అని చెప్పవచ్చు.హాలీవుడ్ సినిమాలకు తీసిపోని స్థాయిలో కల్కి ట్రైలర్ ఉందని ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుందో కూడా కల్కి ట్రైలర్ తో పూర్తిస్థాయిలో అవగాహన వచ్చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాగ్ అశ్విన్ ప్రేక్షకుల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకొని కొన్ని మార్పులు మార్పులు చేస్తే కల్కి( Kalki ) సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.కల్కి 2898 ఏడీ సినిమా చిన్నపిల్లలను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.కల్కి మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం.

కల్కి ట్రైలర్ లో ప్రభాస్ లుక్స్ సైతం ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండటం గమనార్హం.600 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ కు ఈ సినిమా న్యాయం చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.కల్కి ఫస్ట్ పార్ట్ ఈ రేంజ్ లో ఉంటే సెకండ్ పార్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.