తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ ( Ravi Teja ) లాంటి నటుడు మరొకరు లేరు అనేలా తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవితేజ… ఈయన సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలో మాస్ మహారాజా గా గుర్తింపు సంపాదించడమే కాకుండా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను కూడా సంపాదించుకున్నాడు.అయితే ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్( Mr.
Bachchan ) అనే సినిమాకు సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.అయినప్పటికీ ఈ సినిమాలో రవితేజ ఇంతకుముందు చేసిన కొన్ని సినిమాల్లోని కామెడీ బిట్స్ ని వాడుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే రవితేజ చేసిన ప్రతి సినిమాలో కామెడీ వేరే లెవల్లో ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే.ఇక వాటన్నింటిని వాడుకుంటూ కామెడీ ని రిక్రియేట్ చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ భావిస్తున్నాడట.ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన కామెడీ సీన్స్ ( Comedy scenes )ని కూడా రీ క్రియేట్ చేసి రాసుకొని వాటిని షూట్ కూడా చేసినట్టుగా సమాచారం అయితే అందుతుంది.
ఇక మొత్తానికైతే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో ఒక భారీ సక్సెస్ ను కొట్టబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే రవితేజ మార్కెట్ అనేది భారీగా పెరుగుతుంది.అలాగే హరీష్ శంకర్( Harish Shankar ) మార్కెట్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది.ఇక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను కూడా తొందర్లోనే ప్రేక్షకుల ముందు ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది…అయితే ఈ సినిమాతో హరీష్ ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకొని పవన్ కళ్యాణ్ తో ఆయన ఇంతకు ముందు చేసిన గబ్బర్ సింగ్ మేనియా ను మరోసారి రిపీట్ చేయాలని చూస్తున్నారు…
.