అధికారం ఉంది కదా అని కొంతమంది ట్రాఫిక్ పోలీసులు తెగ రెచ్చిపోతుంటారు అనవసరంగా వాహనదారులపై చేయి చేసుకుంటూ తమ క్రూరమైన మనస్తత్వాన్ని బయట పెట్టుకుంటారు.కొంతమంది విషయంలో అలా ప్రవర్తించినా పరవాలేదు, కానీ అమాయకులపై వీరు చేయి చేసుకుంటే మాత్రం అది తీవ్రంగా ఖండించాల్సిందే.
ఇటీవల ఓ ట్రాఫిక్ పోలీసు ( traffic policema )ఒక వ్యక్తి కుక్కను అన్యాయంగా కొట్టాడు.దాంతో చాలా ఫీల్ అయిపోయిన యజమాని ట్రాఫిక్ పోలీస్ పై గొడవకు దిగాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.రోడ్డుపై తన వాహనాన్ని నిలిపివేసిన యజమాని పోలీసు తనను, తన కుక్కను( Dog ) ఒక ట్రాఫిక్ పోలీస్ చిత్రహింసపెట్టాడని ఆ వ్యక్తి ఆరోపించాడు.
ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి వాదన పడుతున్న వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో కచ్చితమైన స్థలం, ఇతర వివరాలు తెలియ రాలేదు.“@Ghar Ke Kalesh” అనే పేరుతో ఉన్న ఓ సోషల్ మీడియా అకౌంట్ ఈ వీడియోను పోస్ట్ చేసింది.రద్దీగా ఉండే రోడ్డు పరిసరాలతో వీడియో మొదలవుతుంది.
ఆ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో చుట్టూ ఉన్న ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు.
ఎటువంటి కారణం లేకుండా ఓ పోలీసు తన కుక్కను కొట్టాడని ఆ వ్యక్తి ఆరోపించాడు.తన కారులో ప్రశాంతంగా కూర్చున్న కుక్కను చూపించి, తనను, కుక్కను కొట్టిన పోలీసు అధికారిని ఆ వ్యక్తి గుర్తించాడు.

ఆ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల స్పందనలు వచ్చాయి.కొందరు ఆ వ్యక్తి పక్షాన నిలబడ్డారు, పోలీసు తన పనికి బాధ్యత వహించాలని అతడిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.మరికొందరు రోడ్డుపై గొడవ సృష్టించడం పట్ల ఆ వ్యక్తిని విమర్శించారు.పరిస్థితి ఏమైనప్పటికీ, కారులో కూర్చున్న కుక్కను కొట్టకూడదని, చేసిన పోలీసులు శిక్షించాలని మరికొందరు బాగా డిమాండ్ చేశారు.







