రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మంగళవారం హనుమాన్ దీక్ష సేవ సమితి వారి ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు పాలాభిషేక కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ(Vemulawada) శాసనసభ్యులు ఆది శ్రీనివాస్( Adi Srinivas) గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో వర్షాలు సంభోగంగా కురిసి పాడి పంటలు పండాలని ఆంజనేయ స్వామివారిని కోరడం జరిగిందన్నారు.
వారి వెంట మొట్టల మహేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, సంఘ స్వామి యాదవ్,చిలుక రమేష్ కనికరపు రాకేష్, పుల్కామ్ రాజు, దాడి మల్లేశం హనుమాన్ దీక్ష స్వాములు తదితరులు ఉన్నారు.