తెలంగాణలో( Telangana ) లోక్ సభ ఎన్నికల పోలింగ్( Loksabha Polling ) కొనసాగుతోంది.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుమారు 40.38 శాతం పోలింగ్ నమోదు అయింది.
కాగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ( Voters ) బారులు తీరారు.
ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనుంది.అయితే చివరి రెండు గంటల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒకటి, రెండు ప్రాంతాలు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.







