బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి( BRS MLA Kaushik Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) తన దగ్గరకు ఒకరిని పంపారని తెలిపారు.
తన వెంట 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ వ్యక్తి చెప్పారని కౌశిక్ రెడ్డి వెల్లడించారు.మాజీ సీఎం కేసీఆర్ తో మాట్లాడమని ఆ మనిషిని పంపించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని( Congress Govt ) మార్చుదామని సమాచారం పంపారన్నారు.
అయితే మానసిక స్థిమితం లేని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటలు తాను నమ్మలేదని తెలిపారు.
అసెంబ్లీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మద్యం తాగి వస్తున్నారని ఆరోపించారు.మొన్నటిదాకా పార్లమెంట్ కు కూడా మద్యం తాగే వచ్చారని కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి.
.






