సంఘ భవనానికి 11 లక్షల విలువ గల స్థలం కేటాయించిన చిదుగు రాధా – గోవర్ధన్ గౌడ్భవన నిర్మాణానికి ఐదు లక్షల విరాళం ప్రకటించిన మండల అధ్యక్షులు గంట కార్తీ గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హెచ్.పి పెట్రోల్ బంకు సమీపంలో మండల గౌడ సంఘ భవనానికి గౌడ కులస్తుల ఆధ్వర్యంలో చిదుగు రాధా – గోవర్ధన్ గౌడ్ లు భూమి పూజ నిర్వహించారు.
గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ…ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మండల గౌడ సంఘ భవన నిర్మాణ కల నేటితో నెరవేరిందని, ఎన్నో పార్టీలు అధికారంలో ఉన్న మండల గౌడ సంఘ భవన నిర్మాణానికి ఎవరు సహకరించలేదని,గౌడ కులస్తుల కోరిక మేరకు కుల బాంధవులను ఏకధాటిపై తీసుకురావాలని ఉద్దేశంతో నిర్ణయించుకున్న గోవర్ధన్ గౌడ్ సుమారు 11 లక్షల విలువ గల 310 గజల స్థలాన్ని గౌడ కులస్తులకు అప్పగించి, గౌడ సంఘం పేరుపైన బాండ్ పేపర్ రాసి అప్పగించారు.ఈ యొక్క స్థలాన్ని నిర్వీర్యం చేయకుండా ప్రతి ఒక్కరు భవన నిర్మాణానికి పూనుకోవాలని, మండల అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్ పెద్ద మనసు చేసుకొని భవన నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందని, కార్తీక్ గౌడ్ ను ఆదర్శంగా తీసుకొని దాతలు ముందుకు రావాలని,అలాగే కుటుంబానికి 500 చొప్పున జమ చేసి నిర్మాణానికి పూనుకోవాలని, అన్ని పార్టీలను గౌరవించాలని నిర్మాణానికి ఏ పార్టీ సహకరించిన నిరాకరించవద్దు అని భవిష్యత్తులో కూడా గౌడ కులస్తులకు అండగా ఉంటానని, నిర్మాణం వెంటనే ప్రారంభించి సంవత్సరంలోగా పనులు పూర్తి చేయాలని తెలిపారు, గౌడ కులస్తులు చిదుగు రాధా- గోవర్ధన్ గౌడ్ ను సన్మానించి, సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంట కార్తీ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, ఆకుల మురళీమోహన్ గౌడ్, ఉపాధ్యక్షులు కోల నారాయణ, కదిరి అంజాగౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి సుధాకర్ గౌడ్, డైరెక్టర్లు,మాజీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గౌడ్, గ్రామ ప్రెసిడెంట్లు, గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.