ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్నాడు.చంద్రుడి మీద కాలు పెట్టాడు.
అంగారకుడి మీద నివాస యోగ్యమైన ప్రాంతాల కోసం అన్వేషణ జరుపుతున్నాడు.ఇప్పుడు ఏకంగా అంతరిక్ష రంగాన్ని విహారయాత్రలకు, పర్యాటకానికి వేదిక చేయాలని భావిస్తున్నాడు.
రానున్న రోజుల్లో స్పేష్ టూరిజం( Space Tourism ) బాగా అభివృద్ధి చెందే అవకాశాలు వున్నాయని నిపుణులు భావిస్తున్నారు.ఇప్పటికే వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ సంస్థలు ఈ దిశగా ప్రయోగాలు చేస్తున్నాయి.
ప్రస్తుతానికి సంపన్నులకు మాత్రమే అందుబాటులో వున్న స్పేస్ టూరిజం రానున్న రోజుల్లో సామాన్యులకు సైతం అందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
![-Telugu NRI -Telugu NRI](https://telugustop.com/wp-content/uploads/2024/04/Meet-Gopichand-Thotakura-An-Indian-Entrepreneur-Set-For-Space-Tour-With-Blue-Origin.jpg)
ఇదిలావుండగా.అమెరికాలో తెలుగు మూలాలున్న గోపీచంద్ తోటకూర( Gopichand Thotakura ) త్వరలో అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు.బ్లూ ఇరిజన్ సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది.
తద్వారా అంతరిక్షం( Space )లోకి వెళ్లనున్న తొలి తెలుగు పర్యాటకుడిగా ఆయన రికార్డుల్లోకెక్కనున్నారు.రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ల వీరంతా గతంలో స్పేస్‌లోకి వెళ్లినవారే.
అయితే వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు.కానీ గోపీచంద్ విషయానికి వస్తే.
ఆయన ప్రస్తుతం అగ్రరాజ్యం( America )లో వుంటున్నప్పటికీ భారత పాస్‌పోర్ట్ కలిగివున్నారు.విజయవాడ( Vijayawada )లోనే గోపీచంద్ పుట్టారు.
ప్రస్తుతం ప్రిజర్వ్ లైఫ్ సంస్థ కో ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు.అట్లాంటా కేంద్రంగా వెల్‌నెస్ సెంటర్‌గా ఈ సంస్థ సేవలందిస్తోంది.
గోపీచంద్ ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ( Embry-Riddle Aeronautical University ) నుంచి ఏరోనాటికల్ సైన్స్‌లో బీఎస్సీ పూర్తి చేశారు.గతంలో మనదేశంలోనే మెడికల్ ఎయిర్ ఎవాక్యుయేషన్ రంగంలో పనిచేశారు.
అలాగే పైలట్‌గానూ గోపీచంద్ శిక్షణ తీసుకున్నారు.
![-Telugu NRI -Telugu NRI](https://telugustop.com/wp-content/uploads/2024/04/Who-is-Gopi-Thotakura-the-first-Indian-space-tourist-to-fly-with-Jeff-Bezos-Blue-origin.jpg)
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థే బ్లూ ఆరిజిన్( Blue Origin ). ఈ సంస్థ గతంలో న్యూ షెపర్డ్ మిషన్ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.2021లో బెజెస్( Jeff Bezos ) సహా ముగ్గురు రోదసీలోకి వెళ్లొచ్చారు.ప్రస్తుతం ఎన్ఎస్ 25 మిషన్‌కు గోపీచంద్ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేసింది బ్లూ ఆరిజిన్.వీరిలో వెంచర్ కేపిటలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా వ్యాపారవేత్త కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడైన కరోల్ షాలర్, అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్‌లు వున్నారు.